Telugudesam: ఈ బడ్జెట్ లో ఎంతో కొంత నిధులు రాష్ట్రానికి వస్తాయనుకున్నాం: యనమల రామకృష్ణుడు

  • ఈ బడ్జెట్ సమస్యలకు పరిష్కారం దిశగా లేదు
  • ఇది ఏ వర్గానికీ అనుకూలంగా లేదు
  • ఏపీ సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయి

ఈ కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎంతో కొంత నిధులు రాష్ట్రానికి వస్తాయని అనుకున్నామని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అయితే, అందుకు విరుద్ధంగా ఈ బడ్జెట్ సమస్యలకు పరిష్కారం దిశగా లేదని, ఏ వర్గానికీ ఇది అనుకూలంగా ఉన్నట్టు కనిపించడం లేదని అన్నారు. నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఎక్కడా ప్రస్తావించలేదని, ఏపీకి సంబంధించి చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.

 పోలవరం ప్రాజెక్టును ఆపేశారని, తమ హయాంలో అప్పు చేసి నిర్మాణాలు చేపట్టామని, విచారణ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి నిర్మాణం కూడా ఆగిపోయిందని, కేంద్ర పథకాలన్నీ రాష్ట్రంపై రుద్దాలని చూస్తున్నారని యనమల విమర్శించారు.

More Telugu News