Gandhipedia: 'వికీపీడియా' తరహాలో 'గాంధీపీడియా': కేంద్ర మంత్రి ప్రకటన

  • లోక్ సభలో ప్రకటించిన నిర్మలా సీతారామన్
  • గాంధీ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడమే లక్ష్యం
  • గాంధీపీడియా ద్వారా ఆయన బోధనల ప్రచారం

కేంద్ర ప్రభుత్వం ఈరోజు కీలక ప్రకటన చేసింది. వికీపీడియా తరహాలో గాంధీపీడియాను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. స్వాతంత్య్రం కోసం మహాత్ముడు చేసిన కృషిని భారత సమాజం గుర్తు పెట్టుకోవడం కోసం... గాంధీ చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఈ ఏడాది మహాత్మాగాంధీ 150వ జయంతిని జరుపుకుంటున్నామని... ఈ సందర్భంగా గాంధీపీడియా ద్వారా మహాత్ముడి గొప్పదనంతో పాటు ఆయన చేసిన బోధనలను కూడా ప్రచారం చేయాలని నిర్ణయించామని చెప్పారు.

More Telugu News