East Godavari District: 8వ తరగతి విద్యార్థినిని రహస్యంగా పెళ్లి చేసుకున్న ఉపాధ్యాయుడు

  • తూర్పుగోదావరి జిల్లా దాలిపాడులో దారుణం
  • బాలికను లోబరుచుకుని ఏడాదిగా సంబంధాన్ని కొనసాగిస్తున్న ఉపాధ్యాయుడు
  • పెద్దల సమక్షంలో రహస్య వివాహం
తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం దాలిపాడులో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. స్థానిక గిరిజన బాలికోన్నత ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికను ఆ పాఠశాలలో పని చేస్తున్న బెలెం చినబ్బాయి అనే ఉపాధ్యాయుడు రహస్య వివాహం చేసుకున్నాడు. ఆ పాఠశాలకు ఆయన వార్డెన్ గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

సదరు విద్యార్థినిని మాయమాటలతో లోబరుచుకున్న చినబ్బాయి... ఏడాది కాలంగా ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం కాస్తా విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిసిపోయింది. దీంతో, చినబ్బాయిని వారు నిలదీశారు. అంతేకాదు, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, పెద్దల సమక్షంలో బాలికను చినబ్బాయి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.
East Godavari District
Dalipadu
Student
Teacher
Secret Marriage

More Telugu News