HudHud Cyclone: 'హుద్‌హుద్' ఇళ్ల లబ్ధిదారులకు కొత్త చిక్కులు

  • 2500 ఇళ్లను నిర్మించి ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం
  • లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలంటూ ఫిర్యాదు
  • ఖాళీ చేయాలంటూ కలెక్టర్ ఆదేశాలు

శ్రీకాకుళం జిల్లాలో హుద్‌హుద్ తుపాను సమయంలో నిలువనీడ లేకుండా పోయిన వారి కోసం అప్పటి ప్రభుత్వం 2500 ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించింది. ఎన్నికల కోడ్ రావడానికి ముందే ఈ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి అందించారు. అయితే ప్రభుత్వం మారడంతో ఆ లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. వైసీపీకి చెందిన కొందరు నేతలు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతం ఆ ఇళ్లను ఖాళీ చేయాలని కలెక్టర్ పేర్కొనడంతో ఆయా గృహాల్లో నివాసముంటున్న వారికి ఇబ్బందులు మొదలయ్యాయి

More Telugu News