Bank: బ్యాంకు ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పిన నిర్మలా సీతారామన్

  • ఇకపై ప్రాంతీయ భాషల్లోనూ నియామక పరీక్షలు
  • 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణ
  • ఇప్పటివరకు ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే పరీక్షలు

ఇప్పటివరకు బ్యాంకుల్లో ఉద్యోగాలకు ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే పరీక్షలు రాయాల్సి వచ్చేది. ఏ రాష్ట్రం వారైనా, ఏ భాషకు చెందిన వారైనా ఈ నిబంధన తప్పేదికాదు. ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసం చేసినవారికి పరాయిభాషలో పరీక్ష రాయడం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది. అయితే, ఇకపై ఆ పరిస్థితిలో మార్పు కనిపించనుంది. బీఎస్ఆర్బీ ఇకమీదట బ్యాంకు నియామకాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లో నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ లోక్ సభలో వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగాల కోసం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

More Telugu News