Andhra Pradesh: టీటీడీ జేఈవో గా బాధ్యతలు స్వీకరించిన బసంత్ కుమార్!

  • తొలుత శ్రీ వరాహస్వామి వారి దర్శనం
  • అనంతరం స్వామివారిని దర్శించుకుని బాధ్యతల స్వీకరణ
  • భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామన్న బసంత్ కుమార్

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) జేఈవోగా ఐఏఎస్ అధికారి బసంత్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తొలుత క్షేత్ర సంప్రదాయాలను పాటిస్తూ ఆయన శ్రీ వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ఆనంద నిలయంలోని శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో జేఈవోగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భక్తుల ద్వారా భగవంతుడికి సేవ చేసే భాగ్యం తనకు కలిగిందని బసంత్ కుమార్ తెలిపారు. టీటీడీలో భక్తులకు మరింత మెరుగైన వసతులు కల్పించేందుకు, అవినీతి లేకుండా పాలన అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. 2017లో కుమార్తె పెళ్లికి కేవలం రూ.16,100 ఖర్చు చేసిన బసంత్ కుమార్, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.18,000తో కొడుకు వివాహం జరిపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

More Telugu News