Andhra Pradesh: రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షసపర్వం ఇదే!: ఆడియో విడుదల చేసిన నారా లోకేశ్

  • టీడీపీ నేతపై వైసీపీ నేత చిందులు
  • జుగుప్సాకరమైన భాషను వాడారన్న లోకేశ్
  • పార్టీ మారనందుకు వేధిస్తున్నారని ఆగ్రహం
పార్టీ మారని టీడీపీ నేతలను వైసీపీ నాయకులు తీవ్రంగా వేధిస్తున్నారనీ, హింసిస్తున్నారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. ఇందుకు సాక్ష్యంగా ఓ ఆడియో క్లిప్ ను లోకేశ్ ఈరోజు ట్విట్టర్ లో విడుదల చేశారు. అందులో ఓ వైసీపీ నేత తమ పార్టీ నేతను ఎలా తిడుతున్నారో చూడాలని సీఎం జగన్ ను కోరారు. ఈ ఆడియోలో వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని వ్యాఖ్యానించారు.

‘సీఎం జగన్ గారూ..! పార్టీ మారను అన్న పాపానికి ఒక టీడీపీ నాయకుడిని ఎలా హింసిస్తున్నారో చూడండి. టీడీపీ నేత భార్యను ప్రస్తావిస్తూ మీ వైసీపీ నేతలు వాడిన భాష ఎంత జుగుప్సాకరంగా ఉందో విని సిగ్గుపడండి. ఇదీ మీ రాజన్న రాజ్యంలో జరుగుతున్న రాక్షస పర్వం’ అని ట్వీట్ చేశారు. ఈ సంభాషణను హెడ్ ఫోన్స్ పెట్టుకుని వినాలని లోకేశ్ సూచించారు.
Andhra Pradesh
Nara Lokesh
Telugudesam
audio
release
Twitter

More Telugu News