Rhinoceros: గుండెలు పిండేస్తున్న వీడియో.. చనిపోయిన తల్లిని తట్టి లేపుతున్న ఖడ్గమృగం పిల్ల

  • కొమ్ముల కోసం ఖడ్గమృగాలను చంపేస్తున్న వేటగాళ్లు
  • పాల కోసం అలమటిస్తూ తల్లిని తట్టిలేపుతున్న పిల్ల
  • ఇది వినాశనకరమన్న ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్

భారత అటవీ అధికారి ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో నెటిజన్ల హృదయాలను పిండేస్తోంది. తన తల్లి వేటగాళ్ల చేతిలో హతమైందన్న విషయం తెలియని పిల్ల ఖడ్గమృగం పాల కోసం తల్లిని తట్టి లేపుతుండడం కంటతడి పెట్టిస్తోంది. ఖడ్గమృగం కొమ్ములను సుగంధ ద్రవ్యాల తయారీల్లో వినియోగిస్తుంటారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా బోల్డంత గిరాకీ ఉంది. దీంతో కొమ్ముల కోసం వేటగాళ్లు వాటిని యథేచ్ఛగా హతమారుస్తున్నారు. ఒక్క భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం వేలాది ఖడ్గమృగాలు వేటగాళ్ల దెబ్బకు బలవుతున్నాయి.

తాజాగా, భారత అటవీ అధికారి షేర్ చేసిన వీడియో మరోమారు ఈ ఘటనను కళ్లకు కడుతోంది. వేటగాళ్ల చేతిలో బలైన తన తల్లిని లేపేందుకు పిల్ల ఖడ్గమృగం ప్రయత్నిస్తోందని, ఇది వినాశనకరమే కాకుండా కళ్లు తెరవాల్సిన సమయమని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ పేర్కొన్నారు. పాల కోసం అలమటిస్తున్న ఆ పిల్ల తల్లిని తట్టి లేపుతుండడం హృదయవిదారకంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News