kcr: స్వగ్రామ సర్పంచ్ కి కేసీఆర్ ఫోన్!

  • గ్రామంలో సమస్యలేమున్నాయి?
  • ఓ నివేదిక తయారు చేయండి
  • సర్పంచ్ హంసకేతన్ రెడ్డికి సూచన
తన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామ సర్పంచ్‌ హంసకేతన్‌ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఓ రిపోర్ట్ తయారు చేసి తనకు అందించాలని ఈ సందర్భంగా కేసీఆర్ కోరారు. చింతమడకను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాను కట్టుబడివున్నానని అన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే తన అభిమతమని చెప్పారు. త్వరలోనే చింతమడకకు తాను వచ్చి సమస్యలను స్వయంగా పరిశీలిస్తానని హంసకేతన్ రెడ్డికి కేసీఆర్‌ స్పష్టం చేశారు.
kcr
Chintamadaka
Sarpanch
Phone

More Telugu News