Ravishankar Prasad: భారత్ లో పెరిగిన టీవీల దిగుమతి!

  • మొత్తంగా రూ. 7,224 కోట్ల విలువైన టీవీల దిగుమతి
  • సగానికి పైగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న భారత్
  • తర్వాతి స్థానాల్లో వియత్నాం, మలేషియా, హాంకాంగ్, తైవాన్

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ రూ.4,962 కోట్ల విలువైన టీవీలు అధికంగా దిగుమతి చేసుకుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. నేడు ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ, రూ. 7,224 కోట్ల విలువైన టీవీలను భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరంలో దిగుమతి చేసుకున్నట్టు స్పష్టం చేశారు.

వీటిలో సగానికి పైగా దిగుమతులను చైనా నుంచి చేసుకోగా, వియత్నాం, మలేషియా, హాంకాంగ్, తైవాన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా చేసుకున్న దిగుమతుల్లో ఈ ఐదు దేశాల నుంచి రూ. 7,011 కోట్ల విలువైన టీవీలను భారత్ దిగుమతి చేసుకున్నట్టు రవిశంకర ప్రసాద్ వెల్లడించారు. ఎల్ఈడీ, ఎల్‌సీడీతో పాటు ప్లాస్మా టీవీలను దేశీయంగా తయారు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు.

More Telugu News