New Delhi: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవం.. పాల్గొన్న కళాకారులు, అధికారులు

  • రెండు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
  • తొలిరోజు అమ్మవారి ఘట స్థాపన
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు దేశం మొత్తానికి  తెలిసేలా ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం బోనాలను ఘనంగా నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను  తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో నిర్వహించనుంది. తొలిరోజు ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్‌లో అమ్మవారి ఘట స్థాపన చేశారు. ఈ ఉత్సవాల్లో తెలంగాణకు చెందిన అధికారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకూ కొనసాగింది.
New Delhi
Telangana
State Government
Ujjayini Mahankali
India Gate

More Telugu News