TATA Ace: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 12 మంది అక్కడికక్కడే మృతి

  • మురుగుమల్ల వెళ్లే దారిలో ప్రమాదం
  • ప్రమాదం జరిగిన వెంటనే పరారైన బస్సు డ్రైవర్
  • నుజ్జు నుజ్జయిన టాటా ఏస్ వాహనం
టాటా ఏస్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చిక్‌బళ్లాపూర్ జిల్లాలో జరిగింది. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే దారిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. టాటా ఏస్‌ను అతి వేగంగా బస్సు ఢీకొట్టడంతో చిన్నారి సహా 12 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కొందరు ఎగిరి రోడ్డుపై పడగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయారు. టాటా ఏస్ వాహనం నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిలో సైతం పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
TATA Ace
Karnataka
Chickballapore
Private Bus
Police

More Telugu News