Telangana: కేసీఆర్ పాలన నీరో చక్రవర్తి పాలనను తలపిస్తోంది: బీజేపీ ఎంపీ బండి సంజయ్

  • లోక్ సభలో జీరో అవర్ లో మాట్లాడిన సంజయ్
  • ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఏం చర్యలు తీసుకున్నారు?
  • విద్యను వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. లోక్ సభలో జీరో అవర్ లో సంజయ్ మాట్లాడుతూ, కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యను వ్యాపార దృక్పథంతో చూస్తున్నారని, అనుభవం లేని గ్లోబరినా సంస్థకు ఫలితాల విడుదల బాధ్యతను అప్పగించారని విమర్శించారు. ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చినా ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నర్ నిక్కచ్చిగా వ్యవహరించాలని సంజయ్ కోరారు.
Telangana
cm
kcr
Bjp
Bandi sanjay

More Telugu News