Andhra Pradesh: ‘ఓ బేబీ’ సినిమాకు మరో గౌరవం.. చెన్నైలో ఎర్లీ మార్నింగ్ షోకు అనుమతి!

  • జీకే సినిమాస్ లో ఉదయం 8 గంటలకు షో
  • తెలుగు కంటే తమిళంలోనే ముందుగా రిలీజ్
  • చెన్నైలోనే పుట్టి పెరిగిన సమంత  
హీరోయిన్ సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ సినిమా ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొరియన్ సినిమా ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా దీన్ని ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

ఈ సినిమాను ఉదయం 8 గంటలకు(ఎర్లీ మార్నింగ్ షో) ప్రదర్శించేందుకు అనుమతి లభించింది. చెన్నైలోని ప్రఖ్యాత ‘జీకే సినిమాస్’ థియేటర్ లో ఓ బేబీ సినిమా స్పెషల్ షో వేస్తున్నారు. అంటే తెలుగు కంటే తమిళంలోనే ‘ఓ బేబీ’ ముందుగా రిలీజ్ కాబోతోందన్న మాట. అన్నట్లు సమంత పుట్టి పెరిగింది చెన్నైలోనే కావడం గమనార్హం.
Andhra Pradesh
Telangana
Tamilnadu
chennai
Tollywood
oh baby

More Telugu News