Hyderabad: హైదరాబాద్ లో ‘ఓ బేబీ’ మానియా.. భారీ కటౌట్ ఏర్పాటు చేసిన సమంత అభిమానులు!

  • నగరంలోని దేవీ థియేటర్ లో ఏర్పాటు
  • ఈ నెల 5న విడుదల కానున్న ‘ఓ బేబీ’
  • తెరకెక్కించిన దర్శకురాలు నందినీ రెడ్డి
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘ఓ బేబీ’ సినిమాపై టాలీవుడ్ లో అంచనాలు భారీగా పెరిగాయి.  ఈ నెల 5న(శుక్రవారం) సినిమా విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో సమంత నిలువెత్తు కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. నగరంలోని దేవి థియేటర్ లో సమంత చిరునవ్వులు చిందిస్తున్న భారీ కటౌట్ ను పెట్టారు.

దీన్ని సోషల్ మీడియాలో సమంత, అక్కినేని అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. దక్షిణకొరియాకు చెందిన సినిమా మిస్ గ్రానీ(2014) స్ఫూర్తితో ‘ఓ బేబీ’ని దర్శకురాలు నందినీరెడ్డి తెరకెక్కించారు.
Hyderabad
devi theatre
oh baby
Tollywood
movie
july 05
release

More Telugu News