Andhra Pradesh: కరకట్టపై అక్రమ నిర్మాణాలు.. బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు సహా ఐదుగురికి సీఆర్డీఏ నోటీసులు!

  • అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
  • లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • ఇప్పటికే లింగమనేని, మంతెనలకు నోటీసులు ఇచ్చిన సీఆర్డీఏ

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా నది కరకట్టపై నిర్మించిన అక్రమ కట్టడాలకు సీఆర్డీఏ నోటీసులు జారీచేస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ యజమాని లింగమనేని రమేశ్, మంతెన సత్యనారాయణరాజు సహా పలువురికి నోటీసులు జారీచేసిన సీఆర్డీఏ, తాజాగా మరో ఐదుగురికి నోటీసులు ఇచ్చింది. కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా భవనాలను నిర్మించిన ఐదుగురికి సీఆర్డీఏ అధికారులు ఈరోజు నోటీసులు జారీచేశారు.

బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు నెక్కంటి వెంకట్రావు, వేదాద్రి మహర్షి తపోవనం, దివి సత్యసాయి, అట్లూరి శాంతిచంద్రలకు చెందిన భవనాలకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు. ఈ అక్రమ కట్టడాలపై వారం రోజుల్లోగా జవాబు చెప్పాలనీ, లేదంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News