Andhra Pradesh: ఏపీలో రవాణా శాఖ కొరడా.. 30 బస్సుల సీజ్.. 48 మంది ఓనర్లపై కేసు నమోదు!

  • టూరిస్ట్ పర్మిట్ బస్సులను స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతున్న కంపెనీలు
  • 15 పాఠశాలల యాజమాన్యాలపై కేసు నమోదు
  • నిబంధనలు పాటించాలని ఆర్టీఏ అధికారుల స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు రవాణా శాఖ కొరడా ఝుళిపించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 30 బస్సులను ఆర్టీఏ అధికారులు ఈరోజు సీజ్ చేశారు. టూరిస్టు పర్మిట్ తీసుకుని బస్సులను స్టేజ్ క్యారియర్లుగా తిప్పుతున్న 48 బస్సుల యజమానులపై కేసు నమోదుచేశారు.

అలాగే ఫిట్ నెస్, సరైన ధ్రువపత్రాలు లేకుండా బస్సులు నడుపుతున్న 15 పాఠశాలల యాజమాన్యాలపై కేసులు పెట్టారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని ఇబ్రహీం పట్నంలో కూడా సరైన అనుమతులు లేని నాలుగు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. పాఠశాల యాజమాన్యాలు, ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు నిబంధనలను పక్కాగా పాటించాలనీ, లేకుంటే కఠిన చర్యలు తప్పవని ఆర్టీఏ అధికారులు హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News