Andhra Pradesh: వైసీపీకి నేనే సమస్యగా మారానేమో!: చంద్రబాబునాయుడు

  • నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారు
  • ప్రజావేదిక ఎందుకు కూల్చేశారో వారికే అర్థం కావడం లేదు 
  • నేనుండే ఇల్లు, నా వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్టున్నారు
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా శాంతిపురంలో నిర్వహించిన కార్యకర్తల భేటీలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికను ఎందుకు కూల్చేశారో వారికే అర్థం కావడం లేదని వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతలపై విమర్శలు చేశారు. ‘నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. వైసీపీకి నేనే సమస్యగా మారానేమో? నేనుండే ఇల్లు, నా వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్టు ఉన్నారు. నా మీద ముప్పై అంశాల్లో అంతర్గత విచారణ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. 
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Chittoor District

More Telugu News