Panchumarthi Anuradha: చంద్రబాబుపై కక్ష సాధింపు పనిలో పడి విత్తనాల పంపిణీని గాలికొదిలేస్తారా?: పంచుమర్తి అనురాధ

  • విత్తన సంక్షోభంపై నేతల మధ్య మాటల యుద్ధం
  • చంద్రబాబుపై పడి ఏడవడం వైసీపీ దురలవాటన్న అనురాధ
  • చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు
ఏపీలో విత్తన సంక్షోభంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీరంటే మీరు కారణమంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. విత్తన సంక్షోభానికి కారణం చంద్రబాబేనంటూ వైసీపీ నేతలు పేర్కొనడంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ స్పందించారు.

నేటి సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై కక్ష సాధింపు పనిలో పడి విత్తనాల పంపిణీని గాలికొదిలేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రతి దానికీ చంద్రబాబుపై పడి ఏడవడం వైసీపీ నేతల దురలవాటని విమర్శించారు. తమ చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే చంద్రబాబును విమర్శిస్తున్నారంటూ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Panchumarthi Anuradha
Andhra Pradesh
YSRCP
Chandrababu

More Telugu News