Rohit Sharma: వరల్డ్ కప్ లో నాలుగో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ... సంగక్కర రికార్డు సమం

  • బంగ్లాదేశ్ పై రోహిత్ 104 పరుగులు 
  • ఓ వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీల రికార్డు అందుకున్న రోహిత్
  • టీమిండియా స్కోరు 31 ఓవర్లలో 184/1

బంగ్లాదేశ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకం సాధించాడు. రోహిత్ శర్మకు ఈ టోర్నీలో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం అని చెప్పాలి. ప్రపంచకప్ లో సెంచరీ అంటే ఓ మధురానుభూతి అని చెప్పాలి. అలాంటిది ఏకంగా 4 సెంచరీలు కొట్టడం అంటే రోహిత్ భీకర ఫామ్ కు నిదర్శనం.

కాగా, బంగ్లాదేశ్ పై సెంచరీతో రోహిత్ శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర ప్రపంచకప్ రికార్డును సమం చేశాడు. సంగక్కర 2015 వరల్డ్ కప్ లో 4 శతకాలు నమోదు చేసి రికార్డు స్థాపించాడు.

ఇక, బర్మింగ్ హామ్ మ్యాచ్ విషయానికొస్తే, సెంచరీ సాధించిన కాసేపటికే రోహిత్ శర్మ వెనుదిరిగాడు. సౌమ్య సర్కార్ బౌలింగ్ లో లిటన్ దాస్ కు క్యాచ్ ఇవ్వడంతో 104 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ సూపర్ ఇన్నింగ్స్ కు తెరపడింది. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 74, కెప్టెన్ విరాట్ కోహ్లీ 1 పరుగుతో ఆడుతున్నారు.

More Telugu News