అధికారంలోకి వస్తే అసెంబ్లీని పేదప్రజల పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్ గా మారుస్తాం: వీహెచ్

02-07-2019 Tue 16:05
  • తెలంగాణకు లక్షా 80 వేల కోట్ల అప్పు ఉంది
  • కొత్త అప్పులు ఎందుకు తెస్తున్నారు?
  • కొత్త భవనాల కంటే విద్యార్థులకు హాస్టళ్లు కడితే మంచిది

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మరోసారి టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. తెలంగాణకు ఇప్పటికే లక్షా 80 వేల కోట్ల రూపాయల అప్పు ఉందని, మళ్లీ కొత్తగా అప్పులు తీసుకురావడం ఎందుకుని ప్రశ్నించారు. ఉన్న భవనాలను కూల్చి కొత్త భవనాలు నిర్మించడం కంటే విద్యార్థులకు వసతి గృహాలు నిర్మించడం మంచిదని వీహెచ్ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అసెంబ్లీని పేద ప్రజల పెళ్లిళ్ల కోసం ఫంక్షన్ హాల్ గా మారుస్తామని అన్నారు. శాసనమండలిని గ్రంథాలయంగా మలుస్తామని చెప్పారు.