modi: పార్టీ పేరును దెబ్బతీసే ఇలాంటి నేతలు అక్కర్లేదు: మోదీ ఫైర్

  • మున్సిపల్ అధికారులపై ఆకాశ్ విజయవర్గీయ దాడి
  • ఎవరి  కొడుకైనా సరే పార్టీ నుంచి తొలగించండి  
  • పార్టీకి చెడ్డ పేరు తెస్తే సహించనంటూ వార్నింగ్
మున్సిపల్ అధికారులపై క్రికెట్ బ్యాటుతో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీయ దాడి చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ కుమారుడే ఆకాశ్. ఈ ఘటనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. ఈరోజు జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ పేరును దెబ్బతీసే ఇలాంటి నేతలు తమకు వద్దని అన్నారు. ఇలాంటి చర్యలు మంచివి కాదని చెప్పారు. ఎవరి కొడుకైనా, ఎవరి బంధువైనా సరే వారిని పార్టీ నుంచి తొలగించాలని అన్నారు. ఇలాంటి వారికి మద్దతిచ్చే వారిని కూడా తొలగించాలని చెప్పారు.
modi
akash varigia
bjp

More Telugu News