Chandrababu: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం!

  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
  • భావోద్వేగాలకు లోనైన చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న రామకుప్పంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి తమ అధినేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. తనకు లభించిన స్వాగతం పట్ల చంద్రబాబు భావోద్వేగాలకు లోనయ్యారు.

"ఎంత ఇబ్బంది ఉన్నా, మీ కుటుంబసభ్యుడిగా ఆదరించారు. మూడు దశాబ్దాలుగా మీ ఆప్యాయతలో ఎలాంటి మార్పులేదు, జీవితాంతం మీకు సేవ చేసుకుంటా" అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలపై దాడుల విషయాన్ని కూడా చంద్రబాబు రామకుప్పంలో ప్రస్తావించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని, కార్యకర్తల్ని తానే కాపాడుకుంటానని స్పష్టం చేశారు.
Chandrababu
Kuppam
Andhra Pradesh
Chittoor District

More Telugu News