LCV: తేజస్ యుద్ధ విమానం నుంచి ఊడి కిందపడ్డ ఫ్యూయల్ ట్యాంక్!

  • సూలూరు వద్ద పొలాల్లో పడిన ట్యాంక్
  • చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్
  • తప్పిన ప్రాణనష్టం
భారత వాయుసేన నిర్వహణలోని తేజస్ ఎల్సీఏ (లైట్ కాంబాయ్ ఎయిర్ క్రాఫ్ట్) యుద్ధ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా, వేరుపడిన ఫ్యూయల్ ట్యాంక్ నేలపై పడింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. ఇంధన ట్యాంక్ ఊడిపోయిన విషయాన్ని పసిగట్టిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, విషయాన్ని ఎయిర్ బేస్ కు తెలిపి, జాగ్రత్తగా ల్యాండింగ్ చేశాడు. సూలూరు ఎయిర్‌ బేస్ కు సమీపంలోని పొలాల్లో పడివున్న ట్యాంక్ ను గుర్తించిన అధికారులు, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు.
LCV
Tejas
Fuel Tank

More Telugu News