Pamula Pushpa Srivani: వైసీపీ నాయకుడు కాబట్టే ఆయన్ను పెళ్లి చేసుకున్నా: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

  • మరో పార్టీ నేత అయితే అంగీకరించేదాన్ని కాదు
  • వైఎస్ జగన్ నాకు సాక్షాత్తు దేవుడే
  • కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి
తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వేళ, కాబోయే భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాబట్టే పెళ్లికి అంగీకరించానని, ఇదే విషయాన్ని పెళ్లికి ముందే ఆయనతో చెప్పానని ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. ఓ వెబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తనకు భర్తగా అనుకుంటున్న వ్యక్తి వైసీపీ నేత కాకుంటే, పెళ్లికి అంగీకరించి వుండేదాన్ని కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తనకు దేవుడివంటి వాడని చెప్పుకొచ్చారు. కాగా, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమెను డిప్యూటీ సీఎం పదవి వరించిన సంగతి తెలిసిందే.
Pamula Pushpa Srivani
Marriage
Jagan
Andhra Pradesh
Deputy CM

More Telugu News