Drunk Driving: ఇకపై హైదరాబాద్ పోలీసులకూ డ్రంకెన్ డ్రైవ్... రోజుకు రెండుసార్లు ఊదాల్సిందే!

  • డ్యూటీకి రాగానే ఓ మారు పరీక్ష
  • వెళ్లిపోయే ముందు మరోమారు
  • వినూత్న నిర్ణయం తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, రాచకొండ పోలీస్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విధులకు హాజరయ్యే పోలీసులకు రోజుకు రెండుసార్లు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం డ్యూటీకి రాగానే ఓమారు, ఆపై డ్యూటీ నుంచి వెళ్లిపోయే ముందు మరోమారు వారేమైనా మద్యం తాగారా? అన్న విషయాన్ని పరీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులే, రాచకొండ లా అండ్ ఆర్డర్ విభాగం పోలీసులను పరీక్షిస్తారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు పోలీసులు మందు కొట్టి ఉన్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Drunk Driving
Hyderabad
Rachakonda
Police

More Telugu News