Sri Lanka: సగం వికెట్లు కోల్పోయిన విండీస్... ఆశలన్నీ బ్రాత్ వైట్, పూరన్ జోడీపైనే!

  • వెస్టిండీస్ 33 ఓవర్లలో 179/5
  • క్రీజులో పూరన్, బ్రాత్ వైట్
  • మలింగకు 2 వికెట్లు

చెస్టర్ లీ స్ట్రీట్ లో శ్రీలంక జట్టుతో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో 339 పరుగుల భారీ లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 145 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. గేల్, హోప్, హెట్మెయర్ వంటి భారీ హిట్టర్లు, కెప్టెన్ జాసన్ హోల్డర్ సైతం పెవిలియన్ చేరిన వేళ కరీబియన్ల ఆశలన్నీ నికోలాస్ పూరన్ (53), కార్లోస్ బ్రాత్ వైట్ (26)పైనే ఉన్నాయి. ప్రస్తుతం విండీస్ స్కోరు 33 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు. విజయానికి ఇంకా 17 ఓవర్లలో 159 పరుగులు చేయాలి. లంక బౌలర్లలో మలింగ రెండు వికెట్లు తీయగా, రజిత, వాండర్సే చెరో వికెట్ దక్కించుకున్నారు.

More Telugu News