Andhra Pradesh: మీరే నాకు శ్రీరామరక్ష.. మీ ఇల్లే నా ఇల్లు: టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు

  • గుంటూరులో టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
  • చంద్రబాబు నివాసం గురించి ప్రస్తావించిన కార్యకర్తలు
  • ‘మేమున్నాం’, ‘మీరు కనపడే దేవుడు’ అంటూ నినాదాలు
టీడీపీకి నష్టం చేయాలని ఎవరైనా అనుకుంటే వారికే నష్టం తప్ప తమకేమీ కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని బలపరిచే ఒక సైన్యాన్ని తయారు చేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలకు బాబు సూచించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో చంద్రబాబు తన నివాసం ఖాళీ చేస్తారన్న అంశం గురించి కార్యకర్తలు ప్రస్తావించారు. ‘మేమున్నాం’, ‘మీరు కనపడే దేవుడు’ అంటూ కార్యకర్తలు నినదించారు.

ఇందుకు చంద్రబాబు స్పందిస్తూ, ‘మీరే నాకు శ్రీరామరక్ష, మీ ఇల్లే నా ఇల్లు. మీరు అండగా ఉంటారని నాకు తెలుసు. మీ గుండెల్లో నాకు ప్రత్యేకస్థానం ఉందని కూడా తెలుసు’ అని అన్నారు. చంద్రబాబుతో ఫొటో దిగేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా తమ కార్యకర్తలకు చంద్రబాబు ఓ సూచన చేశారు. కాళ్లకు నమస్కారాలు చేయొద్దు. ఫొటోలు మాత్రం తీసుకోండి. నా మాట వినండి’ అంటూ చంద్రబాబు చిరునవ్వు నవ్వడంతో, ఆయన పక్కనే ఉన్న పార్టీ నేతలూ నవ్వారు. 
Andhra Pradesh
Chandrababu
Guntur
Undavalli

More Telugu News