vijayanirmala: విజయనిర్మలగారి కోపం తామరాకుపై నీటిబొట్టులాంటిది: పరుచూరి గోపాలకృష్ణ

  • స్త్రీ శక్తి ఎలాంటిదో విజయనిర్మలగారు నిరూపించారు
  • దర్శకురాలిగా 50 సినిమాలు పూర్తిచేయాలనుకున్నారు
  •  కృష్ణగారు ధైర్యంగా ఉండాలి 
తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో విజయనిర్మల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "తెలుగు చిత్రపరిశ్రమలో నటిగా .. దర్శక నిర్మాతగా విజయనిర్మల గారికి ప్రత్యేకమైన స్థానం వుంది. 44 సినిమాలకి ఆమె దర్శకత్వం వహించడం విశేషం. నేను ఆమెను 'పనిరాక్షసి' అనేవాడిని. దర్శకురాలిగా 50 సినిమాలు పూర్తిచేయాలని ఆమె ఆశపడ్డారు .. అభిమానులు కూడా అదే కోరుకున్నారు. కానీ అనారోగ్యం ఆమెను వెంటాడింది .. మన మధ్యలో నుంచి ఆమెను తీసుకెళ్లింది.

విజయనిర్మలగారి సినిమాల్లో కొన్నింటికి మేము పనిచేశాము. ఆమెకి కొంచెం కోపం ఎక్కువే అయినా .. అది తామరాకుపై నీటి బొట్టులా మాత్రమే ఉండేది. ఆమెతో సినిమా అంటే అంతా చాలా క్రమశిక్షణతో ఉండేవారు. నాకు తెలిసి ఆమె ఏ సినిమా కూడా నెలరోజులకి మించి తీయలేదు. స్త్రీ తలచుకుంటే ఏదైనా సాధించగలదనే విషయాన్ని ఆమె నిరూపించారు. ఆమెకి పుణ్యలోక ప్రాప్తి కలగాలనీ, కృష్ణగారి మనసు కుదుటపడాలని కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు. 
vijayanirmala

More Telugu News