meghamsh: నాకు ఇష్టమైన దర్శకుడు రాజమౌళిగారు: మేఘాంశ్ శ్రీహరి

  • నేను ఎన్టీఆర్ గారి అభిమానిని
  •  మహేశ్, ప్రభాస్, బన్నీ సినిమాలు వదలను
  •  రాజమౌళిగారి మూవీలో ఛాన్స్ వస్తే అదృష్టమన్న మేఘాంశ్  
శ్రీహరి తనయుడు మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను ఎంతగానో అభిమానించే దర్శకుడు రాజమౌళిగారు. ఆయన సినిమాలో అవకాశం రావడం కంటే అదృష్టం ఏముంటుంది? ఆయన సినిమాలో చేసే ఛాన్స్ వస్తే టపాసులు కాలుస్తూ .. సంతోషంతో డాన్స్ చేసేస్తాను.

ఇక నేను ఎక్కువగా లైక్ చేసే హీరో ఎవరంటే ఎన్టీఆర్ గారి పేరే చెబుతాను. ఆయన నటన .. ఫైట్స్ .. డాన్సులు నాకు బాగా నచ్చుతాయి. సినిమా చూస్తూ ఈలలు వేస్తూ అరిచి గోల చేసే ఆయన అభిమానుల్లో నేను ఒకడిని. ఇక ప్రభాస్ .. మహేశ్ బాబు .. అల్లు అర్జున్ సినిమాలు కూడా మొదటిరోజు .. మొదటి ఆట చూసేస్తుంటాను. వీళ్లందరి స్టైల్ ను నేను ఇష్టపడతాను" అని చెప్పుకొచ్చాడు.
meghamsh

More Telugu News