ap: తొలి బడ్జెట్ పై కసరత్తు.. 12 శాఖలతో చర్చించనున్న బుగ్గన

  • ఈరోజు, రేపు శాఖలవారీగా ఆర్థికమంత్రి సమావేశం
  • ఈ ఒక్క రోజే 12 శాఖలతో భేటీ
  • నవరత్నాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ తయారు
వైసీపీ ప్రభుత్వం తొలి రాష్ట్ర బడ్జెట్ ను తయారు చేసే పనిలో బిజీగా ఉంది. ఈరోజు, రేపు శాఖలవారీగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ ఒక్క రోజే ఆయన 12 శాఖల మంత్రులు, అధికారులతో చర్చలు జరపనున్నారు. ఈరోజు బుగ్గనతో భేటీ కానున్న మంత్రుల్లో ఆళ్ల నాని, విశ్వరూప్, జయరాం, కొడాలి నాని, తానేటి వనిత, మోపిదేవి, కన్నబాబు, పేర్ని నాని, ధర్మాన, పుష్పశ్రీవాణి, శ్రీరంగనాథరాజు తదితరులు ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు, నవరత్నాలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయనున్నారు.
ap
budget
preparation
buggana

More Telugu News