Andhra Pradesh: 'పోలవరం'లో అవినీతి జరిగిందంటూ పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు.. కేంద్ర జలవనరుల శాఖ స్పందన!

  • అవినీతిపై  ఫిర్యాదు చేసింది మీరేనా అని ప్రశ్న
  • అందుకు సాక్ష్యాలు చూపించాల్సి ఉంటుందని వ్యాఖ్య
  • లేదంటే విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
కేంద్ర జలవనరుల శాఖ నిఘా విభాగం ప్రముఖ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావుకు లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటుచేసుకుందని గతంలో పుల్లారావు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ‘ఆ ఫిర్యాదును చేసింది మీరేనా?’ అని నిఘా విభాగం ప్రశ్నించింది. ఒకవేళ ఆ ఫిర్యాదును పుల్లారావే చేస్తే దాన్ని ధ్రువీకరిస్తూ జవాబు ఇవ్వాలని సూచించింది.

‘మీ ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారా? అందుకు తగ్గ సాక్ష్యాధారాలు ఉన్నాయా? దర్యాప్తు అధికారికి ఈ విషయంలో సహకరిస్తారా?ఒకవేళ ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో నిబంధనల ప్రకారం మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫిర్యాదును విస్మరిస్తాం. ఏ విషయమూ 15 రోజుల్లోగా జవాబు ఇవ్వండి’ అని కేంద్ర జలవనరుల నిఘా విభాగం లేఖ రాసింది. దీంతో పుల్లారావు స్పందిస్తూ .. ఫిర్యాదు చేసిందని తానేనని కేంద్రానికి తెలిపారు.
Andhra Pradesh
polavaram
corruption
pentapati pullarao
letter

More Telugu News