mohan bhagawat: ట్విట్టర్ ఖాతాను ప్రారంభించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

  • భగవత్ తో పాటు ఖాతా తెరిచిన ఐదుగురు కీలక నేతలు
  • ఖాతా తెరిచిన వెంటనే ఆరెస్సెస్ ను ఫాలో అయిన భగవత్
  • ఇంత వరకు ట్వీట్లు చేయని నేతలు
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో ఖాతాను ప్రారంభించారు. ఆయనతో పాటు సంఘ్ పరివార్ కు చెందిన కీలక నేతలు సురేశ్ సోనీ, కృష్ణగోపాల్, సురేశ్ జోషి, అరుణ్ కుమార్, అనిరుధ్ దేశ్ పాండేలు కూడా ట్విట్టర్ ఖాతాలను తెరిచారు. అయితే, వీరెవరూ ఇంతవరకు ట్వీట్ చేయలేదు. ట్విట్టర్ ఖాతాను తెరిచిన వెంటనే ఆయన ఆరెస్సెస్ ఖాతాను ఫాలో అయ్యారు. ఆరెస్సెస్ ట్విట్టర్ ఖాతాకు 13 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.   
mohan bhagawat
rss
twitter

More Telugu News