Gas: ఏకంగా రూ. 100కు పైగా తగ్గిన సబ్సిడీ రహిత గ్యాస్ సిలిండర్ ధర

  • నేటి నుంచి తగ్గింపు ధరలు అమలులోకి
  • సబ్సిడీ సహిత సిలిండర్ ధర కూడా తగ్గే సూచన 
  • ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్, గ్యాస్ ధరలు తగ్గుదల 

ఇండియాలో సబ్సిడీరహిత వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్న వినియోగదారులకు ఐవోసీ (ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌) శుభవార్త చెప్పింది. సబ్సిడీలేని సిలిండర్‌ ధరను రూ. 100.50 తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్, గ్యాస్ ధరలు తగ్గడంతో పాటు, డాలర్‌ తో రూపాయి మారకం విలువ బలపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రస్తుతం సబ్సిడీలేని సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 737.50గా ఉండగా, అది రూ. 637కు తగ్గనుంది. ప్రస్తుతం సబ్సిడీపై అందిస్తున్న సిలిండర్ ధర రూ. 494.35గా ఉండగా, దాని ధర కూడా నేడో, రేపో తగ్గుతుందని అంచనా.

More Telugu News