Akash Vijay Vyragya: బ్యాట్‌తో కొట్టినందుకు బాధలేదు.. మరోసారి బ్యాటింగ్ చేసే అవకాశం రాకూడదని కోరుకుంటున్నా: ఎమ్మెల్యే ఆకాశ్

  • పాత భవనాన్ని కూల్చుతుండగా అడ్డుకున్న ఆకాశ్
  • క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి
  • అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు

నాలుగు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ గంజ్ ప్రాంతంలో ఓ పాత భవనాన్ని కూల్చేందుకు అధికారులు యత్నించిగా అడ్డుకున్న స్థానికులకు అక్కడి ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వైరాగ్య మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో మునిసిపల్ అధికారులు, ఆకాశ్‌కు మధ్య జరిగిన వాగ్వాదంలో ఆగ్రహించిన ఆకాశ్, క్రికెట్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

నేడు ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆకాశ్ మీడియాతో మాట్లాడతూ, తాను అధికారిపై దాడి చేసినందుకు బాధ పడటం లేదని, మళ్లీ బ్యాటింగ్ చేయాల్సిన అవసరం తనకు కల్పించొద్దని భగవంతుణ్ని వేడుకుంటున్నానన్నారు. పోలీసుల ముందే ఓ మహిళతో దురుసుగా ప్రవర్తించిన అధికారిని అంతకంటే ఏం చేయాలో తనకు అర్థం కాలేదని ఆకాశ్ పేర్కొన్నారు.

More Telugu News