Andhra Pradesh: హరిరామ జోగయ్యకు అస్వస్థత.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన పవన్ కల్యాణ్!

  • హైదరాబాద్ లోని ఏఐజీలో హరిరామజోగయ్యకు చికిత్స
  • ఆరోగ్యం గురించి వాకబు చేసిన జనసేనాని
  • వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థన
ప్రముఖ రాజకీయవేత్త హరిరామ జోగయ్య త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. హరిరామజోగయ్య జనసేన పార్టీకి మార్గదర్శకులుగా వ్యవహరించారనీ, పార్టీ హితం కోరుకున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరిరామజోగయ్యను పవన్ కల్యాణ్ ఈరోజు పరామర్శించారు.

ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. 2004-09 సమయంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న హరిరామజోగయ్య తమ కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారని పవన్ గుర్తుచేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
Andhra Pradesh
Telangana
Jana Sena
Pawan Kalyan
harirama jogayya
sick
ill

More Telugu News