Pakistan: బంతిని సుడులు తిప్పుతున్న ఆఫ్ఘన్ స్పిన్నర్లు... లక్ష్యఛేదనలో పాక్ ఎదురీత

  • 5 వికెట్లు కోల్పోయిన పాక్
  • రెండేసి వికెట్లు సాధించిన నబీ, రెహ్మాన్
  • ఓ వికెట్ దక్కించుకున్న రషీద్ ఖాన్

ఒక్కోసారి గొప్పగా ఆడి అందరినీ ఔరా అనిపించే పాకిస్థాన్ జట్టు, కొన్నిసార్లు తేలిగ్గా గెలవాల్సిన మ్యాచ్ ల్లో కూడా పీకలమీదకు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. 228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ ను ఆఫ్ఘన్ స్పిన్నర్లు దెబ్బతీశారు. మహ్మద్ నబీ, ముజిబుర్ రెహ్మాన్ చెరో రెండు వికెట్లతో పాక్ టాపార్డర్ పనిబట్టారు.

ఇటీవల కాలంలో పస తగ్గినట్టుగా కనిపిస్తున్న రషీద్ ఖాన్ కూడా ఓ వికెట్ తీయడంతో పాక్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం పాకిస్థాన్ 36 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కు తోడుగా ఇమాద్ వాసిం వచ్చాడు. పాక్ గెలవాలంటే ఇంకా 14 ఓవర్లలో 84 పరుగులు చేయాలి. మరో 5 వికెట్లు మాత్రమే చేతిలో ఉన్న నేపథ్యంలో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

More Telugu News