Virat Kohli: విజయ్ శంకర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన విరాట్ కోహ్లీ

  • అదృష్టం కూడా కలిసిరావాలి
  • త్వరలోనే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు
  • విజయ్ శంకర్ కు మద్దతుగా మాట్లాడిన టీమిండియా సారథి
వరుసగా అవకాశాలు ఇస్తున్నా తనను తాను నిరూపించుకోలేకపోతున్న ఆల్ రౌండర్ విజయ్ శంకర్ పై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్ లో చాన్స్ రావడం జీవితకాల అదృష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటిది, కేవలం కొన్ని మ్యాచ్ ల అనుభవంతోనే టీమిండియా బెర్తు సంపాదించిన ఈ తమిళనాడు ఆటగాడు వరల్డ్ కప్ లో ఆశించనమేర రాణించడంలేదు. దాంతో విమర్శలు మొదలయ్యాయి. దీనిపై కోహ్లీ బదులిస్తూ, విజయ్ శంకర్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపాడు.

ఈ వరల్డ్ కప్ లోనే విజయ్ శంకర్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని ధీమాగా చెప్పాడు. ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్ ల్లో మెరుగైన దృక్పథం కనబర్చినా, ఆ ఇన్నింగ్స్ లను భారీ స్కోర్లుగా మలచాలంటే అదృష్టం కూడా కలిసిరావాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. "పాక్ పై బాగానే ఆడాడు. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లోనూ ఆధారపడదగ్గ ఆటగాడిగా కనిపించాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ లో బాగా ఆడుతున్న దశలో కీమార్ రోచ్ వేసి ఓ అద్భుతమైన బంతికి అవుటయ్యాడు" అంటూ విజయ్ శంకర్ కు దన్నుగా నిలిచాడు.
Virat Kohli
Vijay Shankar

More Telugu News