Dr Harshavardhan: టీ, బిస్కెట్ల స్థానంలో వేరుశనగపప్పు, బాదం... కేంద్ర మంత్రి 'ఆరోగ్య' సలహా!

  • కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిర్ణయం
  • టీ, బిస్కెట్లతో ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ విముఖత
  • ప్లాస్టిక్ బాటిళ్లలో మంచినీటి సరఫరాపైనా ఆంక్షలు

సాధారణంగా ఎక్కడైనా మంత్రివర్గ సమావేశాల్లో కానీ, ఆయా శాఖల సమావేశాల్లో కానీ టీ, బిస్కెట్లు ఇస్తుంటారు. అయితే టీ, బిస్కెట్లు ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకమీదట కేంద్ర ఆరోగ్యశాఖ సమావేశాల్లో టీ, బిస్కెట్లు ఇవ్వరాదని ఆదేశాలు జారీచేసిన హర్షవర్థన్, ఇకపై తన శాఖ సమావేశాల్లో వేరుశనగపప్పు, బాదం, వాల్ నట్స్ వంటి పౌష్టికాహారానికి స్థానం కల్పించారు. వేయించిన పల్లీలు, బాదంపప్పు తింటే ఎవరికీ ఇబ్బంది ఉండదని, పైగా ఆరోగ్యానికి కూడా మంచిదని మంత్రి పేర్కొన్నారు. ఇక, ప్లాస్టిక్ బాటిళ్లలో మంచినీటి సరఫరాపైనా ఆయన ఆంక్షలు విధించారు. అందుకు ప్రత్యామ్నాయం మాత్రం ఇంకా ఎంచుకోలేదు. 

More Telugu News