sandeep vanga: సల్మాన్ తో 'అర్జున్ రెడ్డి' దర్శకుడు?

  • తెలుగులో 'అర్జున్ రెడ్డి' హిట్ 
  • హిందీలో దూసుకుపోతోన్న 'కబీర్ సింగ్'
  • సందీప్ వంగాకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు

తెలుగులో 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేయడంతో, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అదే సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు అక్కడి నిర్మాతలంతా సందీప్ రెడ్డి వంగా గురించే మాట్లాడుకుంటున్నారట.

బడా నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. టి - సిరీస్ వారు ఆయనతో ఓ భారీ సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా చేయనున్నాడని అంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఓకే అయితే దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా మరో స్థాయికి వెళ్లిపోతాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News