Andhra Pradesh: ఉమా.. జగన్ ను ఏదో అనబోయి ఆగావ్.. చేతబడి ఏమైనా మొదలుపెట్టావా ఏంటి?: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ఏపీ సీఎంపై విరుచుకుపడ్డ దేవినేని ఉమ
  • కౌంటర్ వేసిన విజయసాయిరెడ్డి
  • ఉమ కుటుంబ వ్యవహారాల ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై ఈరోజు టీడీపీ నేత దేవినేని ఉమ విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. టీడీపీ హయాంలో ప్రారంభించిన పలు సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు ఆపేయడాన్ని ఉమ తీవ్రంగా తప్పుపట్టారు. తెలంగాణకు వెళితే జగన్ నోరు మూతపడిపోతోందని ఎద్దేవా చేశారు. తాజాగా ఉమ వ్యాఖ్యలకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు. చూస్తుంటే ఉమ చేతబడి మొదలుపెట్టినట్లు ఉందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘జగన్ గారిని ఉద్దేశించి విధి క్రూరమైందని ఏదో అనబోయి ఎందుకు ఆగావు ఉమా? చేతబడి గాని మొదలుపెట్టావా ఏంటి? మంత్రిగా పనిచేస్తూ మీ అన్న రమణ రైలు ప్రమాదంలో మరణించారు. మీ వదిన గారిది సహజ మరణం కాదంటారు. దుర్మార్గాలతో ఈ స్థాయికి చేరావంటే విధి ఎంత దయలేనిదో తెలియటం లేదూ?’ అని ఘాటుగా విమర్శించారు.
Andhra Pradesh
DEVINENI UMA
Vijay Sai Reddy
YSRCP
Telugudesam
Twitter

More Telugu News