South Africa: పరువు నిలుపుకున్న దక్షిణాఫ్రికా.. వరల్డ్ కప్ లో రెండో విజయం

  • లంకపై 9 వికెట్ల తేడాతో విక్టరీ
  • అజేయ అర్ధసెంచరీలతో కదంతొక్కిన ఆమ్లా, డుప్లెసిస్
  • చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా మ్యాచ్
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు వరుస ఓటముల అనంతరం గెలుపు రుచిచూసింది. శ్రీలంకతో చెస్టర్ లీ స్ట్రీట్ లో జరిగిన లీగ్ మ్యాచ్ లో అన్నిరంగాల్లో రాణించిన సఫారీలు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. కెప్టెన్ డుప్లెసిస్, వెటరన్ ఓపెనర్ హషీమ్ ఆమ్లా అజేయంగా నిలిచి జట్టును 37.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. డుప్లెసిస్ 96 పరుగులు చేయగా, ఆమ్లా 80 పరుగులు సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 175 పరుగులు జోడించారు. ఆఖర్లో డుప్లెసిస్ ఓ బౌండరీతో మ్యాచ్ ను ముగించాడు. అంతకుముందు, శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన దక్షిణాఫ్రికా 2 విజయాలు, 5 ఓటములతో పాయింట్ల పట్టికలో దిగువన కొనసాగుతోంది.
South Africa
Sri Lanka
World Cup

More Telugu News