Chandrababu: చంద్రబాబు మా దైవం.. అయన కోసం మా ప్రాణాలిస్తాం.. చంద్రబాబును కలసిన అనంతరం మీడియాతో రాజధాని రైతులు

  • జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు
  • కరకట్టపై ఆసుపత్రి బీజేపీ నేతకు చెందినది
  • చంద్రబాబు నివాసానికి అనువైన స్థలం ఇస్తాం
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఏపీ సీఎం జగన్ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు ఆరోపించారు. నేడు ఆ పరిసర ప్రాంత రైతులు, మహిళలు కొందరు చంద్రబాబును కలిశారు. అనంతరం వారు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ, చంద్రబాబు మా దైవం.. అయన కోసం మా ప్రాణాలిస్తాం.. ఒకవేళ చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేయాల్సి వస్తే వెలగపూడి, తుళ్లూరు, రావిపూడి గ్రామాల చుట్టుపక్కల ఆయన నివాసానికి అనువైన స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధమని తెలిపారు.

కరకట్టపై ఉన్న ఆసుపత్రి బీజేపీ నేత గోకరాజు గంగరాజుదని, ముందు దానిని కూల్చకుండా ప్రజా వేదికను కూల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమ కట్టడాలని పేర్కొంటున్నవన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కట్టినవేనని, అవినీతి ఎక్కడ జరిగిందో చూపించాలన్నారు. చంద్రబాబు తమ మధ్యే ఉండాలని భావిస్తున్నట్టు ఆ రైతులు పేర్కొన్నారు.

Chandrababu
Gokaraju Gangaraju
Jagan
Hospital
Velagapudi
Tulluru

More Telugu News