Informer: ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి దారుణ హత్య
ఓ గిరిజనుడిని పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా భావించిన మావోయిస్టులు అతడిని దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం బొంజంగి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన కుర్ర సత్తిబాబు అనే గిరిజనుడు తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని భావించిన మావోలు అతడిని గురువారం రాత్రి బలవంతంగా తీసుకెళ్లి హత్య చేసినట్టు సమాచారం.