Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో 30 మంది డీఎస్పీలకు స్థానచలనం

  • రాష్ట్రంలో కొనసాగుతున్న బదిలీలు
  • అనేక విభాగాల్లో అధికారులకు స్థానచలనం
  • డీఎస్పీలను పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశం
ఏపీలో బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. కొత్త ప్రభుత్వం కావడంతో కీలక స్థాయుల్లో ఉన్న అధికారులకు స్థానచలనం తప్పడంలేదు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 30 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. అయితే, పోస్టింగ్ కు బదులుగా ఆ 30 మంది డీఎస్పీలను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు.
Andhra Pradesh
Police
DSP

More Telugu News