Japan: రెక్కలపై నిలబడే పక్షిని చూశారా?.. ఇంటర్నెట్‌లో వైరల్

  • జపాన్‌లో కనిపించిన అరుదైన పక్షి
  • ‘గొరిల్లా కాకి’ వైరల్
  • కాళ్లు కాకుండా రెక్కలపై నిల్చుంటున్న పక్షి
ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఓ పక్షి వీడియో తెగ వైరల్ అవుతోంది. నల్లని రెక్కలతో కాకిని పోలి ఉన్న ఈ పక్షి కాస్త భారీగానే ఉంది. విచిత్రమల్లా.. అది రెక్కలపై నిల్చోవడమే. జపాన్‌లో కనిపించిన ఈ పక్షి కాస్త వింతగా అనిపించడంతో కేటరో సింప్సన్ అనే వ్యక్తి దానిని వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అంతే, ఒక్కసారిగా వైరల్ అయింది. దీనిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. ‘గొరిల్లా కాకి’గా వైరల్ అవుతున్న ఇది అసలు గొరిల్లానా? లేక, కాకా? అన్న విషయం మాత్రం తేలలేదు.

Japan
Gorilla crow
Twitter
Viral Videos

More Telugu News