vijaya nirmala: ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన విజయ నిర్మల

  • కనీసం 50 సినిమాలకు దర్శకత్వం వహించాలని కలలుగన్న విజయ నిర్మల
  • 44 సినిమాల వద్దే ఆగిపోయిన దర్శకురాలు
  • ‘దేవదాసు’ పరాజయంతో తీవ్ర నిర్ణయం
విజయ నిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి. నటిగా, దర్శకురాలిగా ఆమె తన ప్రతిభను నిరూపించుకున్నారు. దాదాపు ఆరు దశాబ్దాల సినీ రంగ ప్రస్థానంలో ఆమె తన చివరి కోరిక తీరకుండానే వెళ్లిపోయారు. 44 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచంలో మరే మహిళకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్న ఆమె.. కనీసం 50 సినిమాలకు దర్శకత్వం వహించాలని అనుకున్నారట. అయితే, ఆమె కల నెరవేరకుండానే తుదిశ్వాస విడిచారు.

తెలుగులో ‘మీనా’ సినిమాతో దర్శకత్వ రంగంలో అడుగుపెట్టిన విజయ నిర్మల తెలుగు, తమిళ భాషల్లోనూ దర్శకత్వం వహించి ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. ‘దేవదాస్’ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఇక దర్శకత్వం నుంచి తప్పుకోవాలని భావించారట. అయితే, జయాపజయాలు మామూలేనని కృష్ణ నచ్చజెప్పడంతో ఆమె దర్శకత్వాన్ని తిరిగి కొనసాగించారు. అయితే, 50 సినిమాలు చేయాలన్న కల మాత్రం కలగానే మిగిలిపోయింది.
vijaya nirmala
Tollywood
Director
super star krishna

More Telugu News