Andhra Pradesh: ఏపీలో ఇవాళ్టి బదిలీలు, నియామకాల వివరాలు ఇవిగో!

  • పీసీబీ కార్యదర్శిగా వివేక్ యాదవ్
  • ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి బదిలీ
  • ఏపీఈపీడీసీఎల్ ఎండీగా నియామకం
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక ఉన్నతస్థాయిలో అధికారుల బదిలీలు, నియామకాల ప్రక్రియ ఊపందుకుంది. ప్రతిరోజూ కొన్ని బదిలీలు, నియామకాలు జరగడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇవాళ కూడా అధికార యంత్రాంగంలో కొన్ని మార్పులుచేర్పులు జరిగాయి. రాష్ట్ర అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ ను బదిలీపై రాష్ట్ర పీసీబీ (పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) కార్యదర్శిగా నియమించారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని ఏపీఈపీడీసీఎల్ ఎండీగా అప్పాయింట్ చేశారు.

వాటర్ షెడ్ అభివృద్ధి డైరెక్టర్ ఎస్.రమణారెడ్డిని ఎస్ఆర్ఈడీసీఏపీ ఎండీ, వైస్ చైర్మన్ గా నియమించారు. మార్క్ ఫెడ్ ఎండీ, ఆగ్రోస్ వైస్ చైర్మన్, ఎండీగా వి. విజయరామరాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అంతేగాకుండా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా సుజాతాశర్మకు పూర్తి బాధ్యతలు అప్పగించారు. సుజాతాశర్మ ప్రస్తుతం కాలేజ్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ గా ఉన్నారు. 
Andhra Pradesh
Prakasam District
Jagan

More Telugu News