apparao: ఆయన వల్లనే 'జబర్దస్త్'లో అవకాశం వచ్చింది: కమెడియన్ అప్పారావ్

  • 'జబర్దస్త్'లో చేయాలని వుండేది
  •  షకలక శంకర్ ఛాన్స్ ఇచ్చాడు
  •  కమెడియన్ గా మంచి పేరు వచ్చింది
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. అలాంటి కమెడియన్స్ లో అప్పారావ్ ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'అందరి ప్రేక్షకుల మాదిరిగానే నేను 'జబర్దస్త్' చూసేవాడిని. ఒకసారి 'జబర్దస్త్' ప్రోగ్రామ్ మేనేజర్ ను కలిసి నా ఫొటోలు ఇచ్చాను.

ఆ తరువాత షకలక శంకర్ .. చలాకీ చంటి నన్ను రమ్మని చెప్పారుగానీ, అదే రోజున మా అమ్మాయి పెళ్లి కావడంతో నేను వెళ్లలేకపోయాను. 'వీడుతేడా' సినిమాలో నేను .. షకలక శంకర్ కలిసి నటించాము. ఆ సినిమా దర్శకుడు చిన్నికృష్ణ, 'జబర్దస్త్'లోకి నన్ను తీసుకోమని షకలక శంకర్ తో చెప్పారు. దాంతో మళ్లీ షకలక శంకర్ నన్ను పిలిపించి అవకాశం ఇచ్చారు. అలా ఆయన ద్వారా నేను 'జబర్దస్త్' కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చాను. షకలక శంకర్ టీమ్ లో చేసినందుకు నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. 
apparao

More Telugu News