raja singh: రాజాసింగ్ ను అరెస్ట్ చేసి.. ముషీరాబాద్ స్టేషన్ కు తరలించిన పోలీసులు

  • అసెంబ్లీ, సచివాలయాలను కూల్చడాన్ని నిరసిస్తూ బీజేపీ నిరసన
  • సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన రాజాసింగ్
  • రాజాసింగ్ తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు అరెస్ట్
తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు రాజాసింగ్ మాట్లాడుతూ, వాస్తు దోషం పేరుతో అసెంబ్లీ, సచివాలయాలను కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. పేదల కోసం రెండు లక్షల ఇళ్లను నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్... కనీసం 20వేల ఇళ్లను కూడా కట్టలేదని మండిపడ్డారు. వృథా అవుతున్న ప్రజాధనాన్ని ప్రజలే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
raja singh
bjp
arrest

More Telugu News